Friday, April 19, 2024
- Advertisement -

అందుకే ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత’ సినిమాను రిజెక్ట్ చేశాను – ల‌య‌

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్స్ లేర‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. గతంలో తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రు తెలుగు హీరోయిన్స్ మాత్రమే ఉండేవారు. కాని ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్స్‌ను చేతివేళ్ల మీద లెక్క పెట్ట‌వ‌చ్చు. 2000లో తెలుగు హీరోయిన్స్‌లో ల‌య ఒక‌రు. చదువుకునే రోజుల‌లోనే హీరోయిన్‌గా న‌టించింది ల‌య‌. వేణు హీరోగా న‌టించిన స్వ‌యంవ‌రం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ప‌రిచియం అయింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో తెలుగులో చాలానే సినిమాలలో న‌టించి మెప్పించింది. పెళ్లి త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంది ల‌య‌.

ఇటీవ‌ల ఆమెకు మ‌ళ్లీ సినిమాల‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికి ల‌య న‌టించ‌లేదు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత‌లో ఓ పాత్ర కోసం ల‌య‌ను సంప్రదిస్తే ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింద‌ని అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా దీనిపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చింది ల‌య‌. పెళ్లి త‌రువాత‌ సినిమాల‌లో న‌టించ‌కూడ‌ద‌ని ఏమి అనుకోలేద‌ని ,పెళ్లి త‌రువాత నాకు ఆఫ‌ర్లు పెద్ద‌గా రాలేద‌ని తెలిపింది.

కాక‌పోతే నాకు ఇంకా వదిన పాత్రలు .. తల్లి పాత్రలు వేసే వయసు రాలేదు. నా వయసుకి తగిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాక‌పోతే అర‌వింద స‌మేత‌లో నా వ‌య‌స్సుకు మించిన పాత్ర కావడంతోనే చేయ‌న‌ని చెప్పాన‌ని తెలిపింది. ఈ విష‌యంలో ఎటువంటి మొహమాటం లేద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -