Friday, April 26, 2024
- Advertisement -

పుట్టిన రోజు నాడే ఆయన పోయారు : హీరోయిన్ రాశి

- Advertisement -

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన తనదైన ముద్ర వేసింది అందాల కథానాయిక రాశి. స్టార్ హీరోల సరసన నటించిన ఎన్నో విజయాలను తన ఖాతలో వేసుకుంది. హీరోయిన్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టి మంచి పాత్రలు చేస్తోంది.

అయితే రాశి ఇటీవలే ’ఆలీతో సరదాగా’ అనే కార్యమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. “నా అసలు పేరు విజయలక్ష్మీ.. మా నాన్నగారిది చెన్నై.. అమ్మది భీమవరం. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. అప్పట్లో వాహిని స్టూడియో దగ్గర మా తాతగారికి ఒక షాప్ ఉండేది.. అక్కడికి ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, భానుమతి, జమున వచ్చేవారట.

చాలాసేపు మాట్లాడేవారట. అందుకే సావిత్రి .. భానుమతి గారు ఇద్దరు మా నాన్నమ్మకు మంచి స్నేహితులయ్యారు. ఇక నేను సినిమాల్లో నటించాలన్నది మా నాన్న కోరికే. ఆయన వల్లే నేను ఇండస్ట్రీలో ఎదిగాను. ప్రతి రోజు కాల్ చేసేవారు. అయితే ఓ రోజు నేను ఊటీలో ఉన్నాను. విజయకాంత్ తమిళ సినిమా షూట్ జరుగుతోంది. ఆ రోజు నా బర్త్ డే కావడంతో సినిమా యూనిట్ కేక్ కటింగ్ ప్లాన్ చేశారు.

అయితే అంతకు ముందు రోజు నాన్న కాల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తున్నాను. అంతలోనే మా అన్నయ్యకు కాల్ వచ్చింది. ఆయన కాల్ మాట్లాడి.. నాన్న చనిపోయారట అన్నాడు. ఇక నాకు దుఖం ఆగాలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నేను బర్త్ డే జరుపుకోలేదు అని రాశి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -