Friday, April 19, 2024
- Advertisement -

పవన్ ఏ మాత్రం మారలేదు : రాశి

- Advertisement -

చిన్నతనంలో నటనతో ఆకట్టుకున్న రాశి.. తర్వాత స్టార్ హీరోయిన్ అయింది. ఆగ్ర హీరోల సరసన తెలుగు, తమిళంలో నటించింది. అయితే ఇటివలే ఆమె ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన గురించి చెప్పారు.

“నాలుగేళ్ల క్రితం మా పాప ఫస్ట్ బర్త్ డేకి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడానికి వెళ్లాను. అప్పుడు ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో ’గోకులంలో సీత’ సినిమా చేశాను. ఆ తర్వాత ఆయనను ఎక్కడ కలవడం కుదరలేదు. తెలిసిన వ్యక్తే కదా అని నేరుగా కార్లో ఆయన ఉన్న లొకేషన్ కు వెళ్లాను. అయితే ఆయన క్యారవాన్ దగ్గర చాలా మంది ఉన్నారు. ’ఒకప్పటి పవన్ కళ్యాణ్ గారు అనుకుని మీరు నేరుగా వచ్చేశారు. అయనను ఇప్పుడు కలవడం కష్టమేమో మేడమ్.. అపాయింట్ మెంట్ ఉండాలేమో’ అని మా డ్రైవర్ అన్నాడు.

సరే అని డ్రైవర్ తోనే కబురు చేశాను. ’అయ్యో కబురు చేయడమేంటి రమ్మని చెప్పు’ అంటూ డ్రైవర్ ను నా దగ్గరకు పవన్ పంపించారు. నేను వెళ్లగానే పవన్ కళ్యాణ్ లేచి నిలబడి ఎంతో ఆప్యాయంగా మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా సేపు మాట్లాడారు. ఆయన క్రేజ్ చాలా పెరిగింది.. కానీ ఆయన మాత్రం మారలేదనిపించింది” అని రాశి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -