పెళ్లికి రెడీ అయిన ర‌కుల్ ..వ‌రుడు అత‌నేనా?

2435
Heroine rakul preet singh ready to marriage
Heroine rakul preet singh ready to marriage

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ర‌కుల్ ప్రీత్ సింగ్.త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితోను న‌టించింది ర‌కుల్ . కాని ఇప్ప‌డు సీన్ రివర్స్ అయింది.అమ్మ‌డు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవిగా క‌నిపించ‌డం మిన‌హా తెలుగులో ఆమె క‌నిపించేది కూడా అనుమాన‌మే.దీంతో ఇక పెళ్లికి రెడీ అయింద‌ట ర‌కుల్‌. రకుల్ తల్లి ఆమెకి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ”ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ వృత్తి పరంగా బిజీగా ఉంటున్నావు.. నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు..?” నీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి అంటూ ఈ మధ్య అమ్మ నన్ను నిలదీసింది. ఇదంతా పెళ్లి కోసమే అని నాకు అర్ధమైంది. సైలెంట్ గా ఉండిపోయాను.

నేను ఎందుకు సింగిల్ గా ఉన్నానో.. ఇప్పటికీ నాకు తెలియదని” అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మరిన్ని విషయాలను చెబుతూ.. ”రోజూ సాయంత్రం కాగానే నా స్నేహితుల్ని నాకొక మంచి పార్టనర్ ని చూడమని చెబితే మీరు నిర్లక్ష్యం చేస్తారా అంటూ తిడుతుంటాను. అమ్మ ఏమో పెళ్లి వయసు దాటిపోతుంది.. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటోంది.ప్రేమ, పెళ్లి అంటే నాకు కూడా ఇష్టమే.. ముంబై, హైదరాబాద్ లో స్నేహితులందరికీ మంచి అబ్బాయిని చూడమని చెప్పాను. వారు అదే పనిలో ఉన్నారని అమ్మకి చెప్పాను” అంటోంది రకుల్.హీరో రానాతో ర‌కుల్ కొంత‌కాలం క్లోజ్‌గా ఉంది.దీంతో ర‌కుల్ రానానే పెళ్లి చేసుకుంటుంద‌ని అనుకుంటున్నారు.