Saturday, April 20, 2024
- Advertisement -

సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

- Advertisement -

టాలీవుడ్ లో సమంతకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏ పాత్ర ఇచ్చిన సరే అందులో జీవించేస్తోంది. అందుకే టాలీవుడ్ స్టార్ హిరోయిన్ అయింది. ఏమాయ చేశావో సినిమాతో కుర్రకారు మదితోపాటు హీరో నాగచైతన్య మదిని కూడా దోచేసి ఇద్దరు మనువాడే దాకా వీరి ప్రయాణం సాగింది. పెళ్ళి తర్వాత ఎక్కువగా హీరోయిన్ కి ప్రాదాన్యత ఉన్న సినిమాలే చేస్తోంది సమంత. సమంతకు సినిమాలతోపాటు ఓ వ్యాపకం కూడా ఉందట.. అదే విలాసవంతమైన కార్లు అంటే సమంతకు బాగా ఇష్టమట. కోట్లలో పారితోషికం తీసుకునే ఈ ముద్దుగుమ్మ వద్ద ఇప్పటికే బోలెడు కార్లు ఉన్నాయన్నది చాలా మందికి తెలియదు. సమంత దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

*సమంత 33వ పుట్టినరోజును ఏప్రిల్ 28న జరుపుకుంది. ఆమెకు కార్లు అంటే బాగా పిచ్చి కావడంతో ఇటీవలే బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కొన్నది. దీని ధర ఏకంగా రూ.76లక్షలు కావడం గమనార్హం. ఈ కారు బుల్లెట్ ఫ్రూఫ్ కూడా. ఏ47తో దాడి చేసినా వాహనానికి ఏం కాదు. 100కి.మీల వేగాన్ని కేవలం 4.9 సెకన్లలోనే అందుకుంటుంది.

*ఇక సమంత ఇదివరకు కొన్న మరో కారు జాగ్వర్ ఎక్స్ ఎఫ్. దీని ధర ఏకంగా రూ.62లక్షలు. ఈ కారులోనే మొన్నటివరకు సమంత ప్రయాణించింది.

*ఇక సమంత కొన్న మరో భారీ కారు ఆడీక్యూ7. ఈ ఎస్యూవీ ధర ఏకంగా రూ.77.17లక్షలు. భారత్ లోనే అత్యంత ఎక్కువ విక్రయాలు సాగేది ఈ కారే. ఆధునిక ఫీచర్లు సాంకేతిక దీని సొంతం.

*ఇక సమంతకు అత్యంత ఇష్టమైన స్పోర్ట్స్ కారు ‘పోర్షే కేమ్యాన్ జేటీఎస్’. ఎంతో ఇష్టపడి కొన్న ఈ కారు ధర రూ.1.15 కోట్లు కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -