Friday, March 29, 2024
- Advertisement -

హై కోర్టు లో సమంత కి చుక్కెదురు

- Advertisement -

సమంత హీరోయిన్ గా, సిద్దార్థ్ హీరో గా నందిని రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమా జబర్దస్త్. ఈ సినిమా ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. సినిమా విడుదల అయినా మొదటి రోజున నే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కి ఆశించిన స్థాయి లో విజయం రాలేదు, కలెక్షన్స్ కూడా అంతంత మాత్రం గా నే ఉన్నాయి. అయితే 2013 లో విడుదల అయిన ఈ సినిమా అప్పటికే హిందీ లో విడుదల అయినా బాండ్ బాజా బారత్ అనే సినిమా కి రీమేక్. అసలు హిందీ సినిమా వాళ్ళ అనుమతి లేకుండా నందిని రెడ్డి సినిమా ని కాపీ కొట్టేసింది.

ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఒరిజినల్ నిర్మాతలు ఈ సినిమా పై కోర్టు మెట్లు ఎక్కారు. నందిని రెడ్డి కి, సినిమా నిర్మాత కి నోటీసులు పంపారు. అయితే పలు సార్లు కోర్టు లో కేసు విచారణ జరిగిన అనంతరం నిన్న ఎట్టకేలకు హైదరాబాద్ హై కోర్టు ఈ సినిమా విషయం లో ఒక తీర్పు ని ఇచ్చింది.

ఈ సినిమా ఇక పై ఏ మీడియా మాధ్యమం లో కూడా ప్రదర్శించకూడదు అనే తీర్పు ని ప్రవేశపెట్టింది. దాని అర్థం ఆన్లైన్ లో, టీవీ లలో ఈ సినిమా వచ్చే ఆస్కారం లేదన్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -