రాజమౌళి తండ్రి ఎక్కడా తగ్గట్లేదు..

336
Highlights in Jayalalitha Biopic
Highlights in Jayalalitha Biopic

ఇప్పటికే తమిళ నాడు మాజీ ముఖ్య మంత్రి జయ లలిత మీద ముగ్గురు నలుగురు దర్శకులు బయోపిక్ లు ప్రకటన చేశారు. ఇదే కాకుండా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక వెబ్ సిరీస్ కూడా తీస్తున్న నేపధ్యం లో దర్శకుడు విజయ్ తీస్తున్న సినిమా మాత్రం సర్వత్రా ఆసక్తి ని క్రియేట్ చేస్తున్నది.

ఈ సినిమా లో జయ లలిత పాత్ర లో కంగనా రనౌత్ మెరవనుండగ బాహుబలి, భజరంగి భాయిజాన్, మణికర్ణిక వంటి చిత్రాలకు రైటర్ గా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానున్న సందర్భం లో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా మీద చాలా నమ్మకం తో ఉన్నారట. కథ లో జయ లలిత పాత్ర కి అనుకూలంగా అనేక రాజకీయ అంశాలకి సంబందిచిన సన్నివేశాలు ఉండబోతున్నాయి అట. ఇవన్నీ సినిమా కి ప్రధాన ఆకర్షణ అని ప్రస్తుతం ఫిలిమ్ నగర్ లో టాక్ నడుస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్ ని నిర్మించిన విబ్రి మీడియా ఈ సినిమా ని తమిళం లో నిర్మిస్తోంది. అతిత్వరలో ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ మడలుకనున్నది. ఈ సినిమా సమండించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి

Loading...