బెంజ్‌ కార్ ఎలా కొన్నాదో చెప్పిన నటి హిమజ..!

11446
Himaja Strong Counter To Netizen Over Her Mercedes Benz Car
Himaja Strong Counter To Netizen Over Her Mercedes Benz Car

బుల్లితెరపై తన కెరీర్ ను మొదలు పెట్టి.. తర్వాత వెండితెరపై వినయ విధేయరామ, చిత్ర లహరి, స్పైడర్, శతమానం భవతి, మహానుభావుడు, నేను శైలజ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాధించుకుంది హిమజ. అయితే ఈమె బిగ్ బాస్ గత సీజన్ లో అడుగు పెట్టి ఆ క్రేజ్ ను మరింత పెంచుకుంది. తొమ్మిది వారాలు పాటు లాంగ్ జర్నీ చేసి డేరింగ్ డాషింగ్ లేడీగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె ఇటీవల ఖరీదైన బెంజ్ కార్ కొనుగోలు చేయడంతో.. అది ఎక్కడిది? ఎలా కొన్నావ్ అని ఓ నెటిజన్ అడగడంతో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

సినిమాల్లోకి రాకముందు చాలా జాబ్స్ చేశా. అలా వచ్చిన డబ్బు నాకు సరిపోయేవి కాదు. నాకు ఫుడ్, షాపింగ్ అంటే బాగా ఇష్టం. వచ్చిన డబ్బులు అద్దెకు.. మిగిలిన ఖర్చులకు సరిపోయేవి. ఇక టీచర్ గా చేసినప్పుడు లైఫ్ అంటే ఏంటో అర్దం అయింది. నాకు తెలిసిన అంకుల్ ఈటీవీ భార్యమణి సీరియల్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు. ఆయనకు నేను యాక్ట్ చేస్తాను అని చెప్పా. ఫోటోలు తీసుకుని రమ్మన్నాడు. నన్ను ఆయన నాలుగేళ్ళ తర్వాత చూశారు. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నావ్ అని బేగం పేట్ ఈటీవీ ఆఫీస్‌కి పంపారు. ఒక్కదాన్నే వెళ్లా.. అక్కడ నన్ను రిసీవ్ చేసుకుని స్క్రీన్ టెస్ట్ చేశారు. తెలుగు అమ్మాయి లుక్ ఉంది అని నటన నేర్పిస్తే ఖచ్చితంగా మంచి నటి అవుతుందని నాకు అవకాశం ఇచ్చారు.

స్టార్టింగ్‌లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను కాని.. తరువాత మెల్లగా యాక్టింగ్ నేర్చుకున్నా అని హిమజ చెప్పింది. ఇక మెర్సిడీస్ బెంజ్ కారు గురించి చెబుతూ.. ఈ కారు కష్టపడి కొన్నాను. ప్రతి నెల ఈఎంఐ కడుతున్నా. బెంజ్ కంపెనీ వారు జీరో ఫైనాన్స్ మీదా ఈ కారు ఇచ్చారు. నేను ఆర్టిస్ట్ ను కాబట్టు.. మా అసోశేయేషన్ కార్డ్ ఉంది కాబట్టి.. నాకు ఈ కారు ఉన్న రేటుకి ఇచ్చారు. ప్రతినెల 4 తారీఖున ఈఎంఐ కట్ అవుతుంది. ఒక్కరూపాయి కూడా కట్టకుండా కారు తీసుకున్నా.. ఎప్పుడైనా డబ్బులు ఇబ్బందైతే నీకు (కారు ఎక్కడిది అని అడిగిన నెటిజన్) ఫోన్ చేస్తా.. నువ్ వచ్చి కట్టు. రెండు నెలల నుంచి నాకు వర్క్ లేదు.. ఆదాయం లేదు.. ఆ అడిగినోడు ఈఎంఐ కడతాడేమో అడుగుతా’ అని కౌంటర్ ఇచ్చింది హిమజ.

Loading...