Friday, March 29, 2024
- Advertisement -

‘హిప్పీ’ సినిమా రివ్యూ

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ తాజాగా ‘హిప్పీ’ అనే సినిమాలో సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ సినిమా ‘జిలేబి’ ఫేమ్ దిగంగన సూర్యవంశీ ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు. టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం తాజాగా ఇవాళ అనగా జూన్ 6 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.

కథ: దేవ్ (కార్తికేయ) స్నేహ (జజ్బా సింగ్) ని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు అతను స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశీ) ని కలుస్తాడు. ఆమెతో వెంటనే ప్రేమలో పడతాడు దేవ్. ఎలాగైనా ఆమెను కూడా ప్రేమలో పడేయాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. కొన్ని సందర్భాల తరువాత అముక్తమాల్యద కూడా దేవ్ ని ఇష్టపడుతుంది కానీ ఆమె ఏం చెప్పినా అది తను వినాలి అంటూ దేవికి కండిషన్ పెడుతుంది. దేవ్ ఆ షరతు కి కూడా ఒప్పుకుంటాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అసలు వారి మధ్య ఏం జరిగింది? ఆనంద్ (జె.డి.చక్రవర్తి) పాత్ర ఏంటి? చివరికి వాళ్లు కలిసారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: కార్తికేయ ఈ సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచాడు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పోలిస్తే కేవలం నటనలోనే కాక డైలాగ్ డెలివరీ లో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మరింత ఒక ప్లస్ పాయింట్ గా మారింది. దిగంగన సూర్యవంశీ కేవలం తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా మెప్పిస్తుంది. ఈ సినిమాలో తన పాత్రకు పర్ఫార్మెన్స్ కి అంత స్కోప్ లేకపోయినా తన నటనతో బాగా మెప్పించింది. జజ్బా సింగ్ కూడా చాలా బాగా నటించింది. దిగంగన కి పోటీ ఇస్తూ పర్వాలేదనిపించింది. జె.డి.చక్రవర్తి నటన ఈ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించి జె.డి.చక్రవర్తి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఎం.డి.అసిఫ్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వుల పువ్వులు ఇస్తాడు వెన్నెల కిషోర్.

సాంకేతిక వర్గం: దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ సినిమా కోసం గొప్ప కథ అంటూ రాయలేదు కానీ కథలో ప్రేమ, రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ బాగానే జోడించారు. కానీ ప్రేక్షకులను అలరించడం లో మాత్రం విఫలమయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టిన దర్శకుడు కామెడీ ని కూడా సరిగ్గా పండించలేదు. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నివాస్ కే ప్రసన్న అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. కేవలం పాటలు మాత్రమే కాక ఈ సినిమా నేపథ్య సంగీతం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అతని కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది.

తీర్పు: సినిమాని ఆసక్తికరంగానే మొదలుపెట్టినప్పటికీ దర్శకుడు సినిమా మొత్తం అదే ఫ్లో తో నడపలేకపోయాడు అని చెప్పుకోవచ్చు. రెండవ హాఫ్ తో పోల్చుకుంటే మొదట హాఫ్ పరవాలేదనిపిస్తుంది కానీ మొదటి హాఫ్ లో కూడా కొన్ని కామెడీ సీన్లు బలవంతంగా నవ్వు తప్పించడానికి పెట్టినట్లే అనిపిస్తుంది. ఒక బలమైన కథ లేకపోవడం ఈ సినిమా కి పెద్ద నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సరే కథ ఎలా ఉన్నా దర్శకుడు దాన్ని చెప్పే విధానం బాగా ఉందా అంటే అది కూడా బాగా లేదనే చెప్పుకోవాలి. కేవలం ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టిన దర్శకుడు దానిని కూడా కార్తికేయ మరియు దిగనా ల మధ్య ప్రేమ కథను కూడా సరిగ్గా చిత్రీకరించలేదు. క్లైమాక్స్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. ఆఖరిగా ‘హిప్పీ’ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -