Saturday, April 20, 2024
- Advertisement -

హాట్ టాపిక్‌గా మారిన ర‌ష్మిక ‘టాటూ’

- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్క‌డ విన్న ర‌ష్మిక పేరే వినిపిస్తుంది.ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచియం అయింది.ఇక విజ‌య్ దేవ‌ర‌కొండతో న‌టించిన గీతా గోవిందం హిట్ కావ‌డంతో మంచి జోష్‌లో ఉంది ర‌ష్మీక.ఇక ఆమె తాజాగా న‌టించిన దేవ‌దాస్ సినిమా ఈ నెల 27న విడుద‌ల‌కు రెడీగా ఉంది.ఈ సినిమాతో త‌ను హ్యాట్రిక్ అందుకోవ‌డం ఖాయం అని ధీమాగా వ్య‌క్తం చేసింది.నిన్న‌(గురువారం) దేవ‌దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.ఈవెంట్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది ర‌ష్మిక‌. ఈ వేడుకలో పాల్గొన్న రష్మిక తన అందంతో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేసింది.చక్కటి కాస్ట్యూమ్స్ తో వచ్చి కెమెరా క్లిక్కులన్నీ తనవైపు ఉండేలా చూసుకుంది.

ఈ క్రమంలో కొన్ని కెమెరాలు రష్మిక టాటూని టార్గెట్ చేశాయి. ఇప్పుడు ఆ టాటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ టాటూ త‌న మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి కోసమే వేయించుకుందని వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.రక్షిత్‌ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుస్తుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. రక్షిత్-రష్మికల బ్రేకప్ లో చాలా మంది రష్మికనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జంట ఎందుకు విడిపోయిందనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ అభిమానులు మాత్రం తప్పు రష్మికదే అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఇంత‌కి ఈ టాటూ అర్థం ఏమిటో ర‌ష్మిక వివ‌ర‌ణ ఇచ్చేవ‌ర‌కు దీనిపై చ‌ర్చ మాత్రం ఆగ‌దు.దేవ‌దాస్ సినిమాలో ర‌ష్మిక నానితో జంట‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -