Thursday, April 18, 2024
- Advertisement -

ఆ విషయంలో ఏమాత్రం తగ్గను అంటున్న రామ్ చరణ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అయినా ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా తో బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన మెగాస్టార్ ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓవర్సీస్ విడుదలపై మాత్రం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైరా సినిమా పైన భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఓవర్సీస్లో సినిమా థియేట్రికల్ రైట్స్ ను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదని సమాచారం. దానికి కారణం నిర్మాతలు అడుగుతున్న రేట్లు అని వినికిడి.

నిజానికి ‘సైరా’ సినిమాని ఓవర్సీస్లో 25 కోట్ల కి అమ్మాలని నిర్మాత రామ్ చరణ్ అనుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడంతో 20 కోట్లకు తగ్గారు చెర్రీ. కానీ తాజాగా ఫార్స్ ఫిల్మ్స్ వారు సినిమా రైట్స్ కోసం 15 కోట్లు ఆఫర్ చేశారు కానీ రామ్ చరణ్ మాత్రం డీల్ ఓకే చేయడానికి ఆసక్తి చూపటం లేదు. ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఎదురు చూస్తున్నారని సమాచారం. ఒకవైపు విడుదల తేది దగ్గర పడుతుంది కానీ ‘సైరా’ సినిమా ఓవర్సీస్ విడుదల విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరగా డీల్ క్లోజ్ చేసి ప్రమోషన్లపై దృష్టి పెట్టనిదే సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కవని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -