Thursday, April 25, 2024
- Advertisement -

నాగబాబుతో కలిసి అదిరింది షోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదే : హైపర్ ఆది

- Advertisement -

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ మరో షోకు లేదని చెప్పాలి. అయితే ఈ షోలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వారిలో హైపర్ ఆదికి మంచి క్రేజ్ ఉంది. అయితే జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడం అదిరింది షోలో అయన జడ్జీగా ఉండటం కాస్త గందరగోళంగా మారింది. ఈ క్రమంలో నాగబాబు గురించి ఆది పలు విషయాలు చెప్పుకొచ్చాడు. నాగబాబు అదిరింది షోకు వెళ్లినా.. ఆయన మాకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంటారు.

మీరు బాగా చేయాలి, మనవాళ్లంత బాగా చేయాలి అని నాగబాబు మెసేజ్ పెట్టారు అని ఆది చెప్పారు. అదిరింది షో కోసం నన్ను అడిగారు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. కొందరు వ్యక్తుల వల్ల నేను నాగబాబుతో కలిసి ఉండలేకపోయినా.. రెగ్యులర్‌గా ఆయనతో మాట్లాడుతుంటాను. జనసేన పార్టీ తరఫున నేను ప్రచారం చేశాను. అలాగే నాగబాబుగారు ఎంపీగా నిలబడిన సమయంలో ఆయనతోపాటు నియోజకవర్గం అంతా తిరిగాను.

ఆయనతో అనుబంధం సినీ, రాజకీయ, టెలివిజన్ పరంగా గొప్పగా ఉందని అది అన్నాడు. జబర్దస్త్ వల్ల మాకు బాగా ప్రజాదరణ లభించింది. నా స్వభావాన్ని చూసి కొంత మంది డౌన్ టూ ఎర్త్ అని, నా మాట్లాడే తీరు వల్ల కొంతమంది నాకు బలుపు అనుకొంటారు. బుల్లితెరపై ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఆది తోపు అనుకోవడం తప్పు. ప్రతీ ఒక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంది. అందరూ కలిస్తేనే జబర్దస్త్. నా వల్లే షో మరో లెవల్ కు వెళ్లిందనడం కరెక్ట్ కాదు. జబర్దస్త్ అనే టీమ్ వర్క్ వల్లే జబర్దస్త్ టాప్ లో ఉందని ఆది అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -