Saturday, April 20, 2024
- Advertisement -

నన్ను చూసి చిరంజీవిగారు కారు దిగారు : హైపర్ ఆది

- Advertisement -

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా అతి తక్కువ టైంలో బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. ఈ షో ద్వారా సంపాధించుకున్న క్రేజ్ తో ఆయన సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ అయ్యాడు. ఇక అంతేకాకుండా రచయితగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు.

అయితే పూర్తి స్థాయిలో సినిమా మొత్తం స్క్రిఫ్ట్ ను రాయడమే తన ఆశయమని తాయా ఇంటర్వ్యూలో ఆది చెప్పాడు. అంతేకాకుండా తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగిందంటూ దానిని గురించి చెప్పుకొచ్చాడు. ‘జబర్దస్త్’ చేస్తున్న సమయంలోనే ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. అక్కడ చిరంజీవిగారు తన షూటింగును పూర్తి చేసి బయలుదేరుతున్నారు. ఆయనను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ఓ సాధారణమైన అభిమానిగానే నేను ఆయన కారుకు దగ్గరగా నిలబడ్డాను. కార్లో కూర్చున్న తరువాత ఆయన నన్ను చూశారు.

నన్ను చూసిన వెంటనే కారు దిగేసి వచ్చి ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. ‘మీ స్కిట్లు చూస్తుంటాను .. చాలా బాగుంటాయి .. మీ పంచ్ లు బాగా నవ్విస్తాయి’ అంటూ ఆయన నా పనితీరును ప్రశంసించారు. అంతటి గొప్ప నటుడు అంతలా నాతో మాట్లాడడం నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా భావిస్తుంటాను. నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన టీవీ రంగాన్ని నేను ఎప్పటికీ వదిలేయను ‘ అని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -