సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చాను : హైపర్ ఆది

628
hyper aadi comments on sunil
hyper aadi comments on sunil

హైపర్ ఆది.. ఇప్పుడు ఈ కమెడియన్ కి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ తో బాగాక్రేజ్ సంపాధించుకున్న ఆది.. సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే అతను ‘జబర్దస్త్’ కు రాకముందు ఏం చేసేవాడు? అసలు ‘జబర్దస్త్’ కు ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనే విషయాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చాడు.

అలానే కమెడియన్ సునీల్ గురించి కూడా చెప్పాడు. ఆది మాట్లాడుతూ..”నాకు స్క్రీన్ పై కన్పించాలన్న కోరిక ఏం లేదు. అయితే బీటెక్ చేశాక.. జాబ్ చేస్తుండగా ఈ ఆలోచన వచ్చింది. ఆ టైంలో ‘జబర్దస్త్’ బాగా పాపులర్ అయిన షో. జాబ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా నేను నా ఫ్రెండ్స్ ఆ షో చూసే వాళ్ళం. హైదరాబాద్ కు వచ్చినప్పటి నుండీ .. ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని కోరిక ఉండేది. ఇక అదే టైంలో నేను చేసిన ఓ చిన్న షార్ట్ ఫిలింకు అదిరే అభి.. ‘చాలా బాగుంది బ్రో.. ఒకసారి కలువు’ అంటూ మెసేజ్ పెట్టాడు. దాంతో వెంటనే వెళ్లి అభిని అలాగే అతని టీం వాళ్ళను కలిసి.. ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టాను.

ఆ ఫోటోలకు చాలా లైక్స్ వచ్చాయి. తరువాత ‘అన్నా.. నీ టీం లో ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమని’ అభిని బ్రతిమిలాడే వాడిని. దాంతో ఓ ఎపిసోడ్ లో సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్ ఇచ్చాడు.కానీ దాంతో సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ అభి అన్నని బ్రతిమాలుతూనే క్యారెక్టర్లు సంపాదించాను. తరువాత నేనే స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది. అవి యూనిట్ సభ్యులకు కూడా నచ్చడం.. మంచి రెస్పాన్స్ రావడంతో.. నన్ను టీం లీడర్ ను చేసారు. నేను టీం లీడర్ అయ్యాక. మరోసారి సునీల్ గారితో స్కిట్ చేశాను. ఈ సారి ఆయనపై పంచ్ లు కూడా వేశాను” అంటూ ఆది చెప్పుకొచ్చాడు.

చరణ్, ఉపాసన ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడానికి రీజన్ ఇదే..!

లక్ష్మీ మంచు కూతురుకి సర్ ఫ్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

నా హీరో సూసైడ్ చేసుకున్నాడు.. నేను చేసుకోలేనా : సుశాంత్ ఫ్యాన్ ఆత్మహత్య

మంచు లక్ష్మీ కూతుర్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

Loading...