Saturday, April 20, 2024
- Advertisement -

గెస్ట్ హౌస్‌కు పిలిచేవారు : ఆమ‌ని

- Advertisement -

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌ల‌ను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ వ‌ద‌లడం లేదు.రోజు ఎవ‌రో ఒక‌రు ఇండ‌స్ట్రీలో త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.తాజాగా మ‌రో సీనియ‌ర్ న‌టి ఇండ‌స్ట్రీలో త‌న‌కు జరిగిన లైంగిక వేధింపులపై స్పందించింది.అప్పట్లో సుమారు ఓ పాతిక సంవత్సరాల క్రితం హోమ్లీ హీరోయిన్ గా ఆమనిది ప్రత్యేకమైన స్థానం.హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తోంది. అయితే కెరీర్ ఆరభంలో ఆమె ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఇప్పుడు ప్రస్తావించింది.

”నా ఫోటోలను, నన్ను చూసి బాగానే ఉన్నావని చెప్పి మరుసటి రోజు ఫోన్ చేసి మన గెస్ట్ హౌస్ ఉంది కదా.. అక్కడికి వచ్చేయండి మేకప్ టెస్ట్ చేస్తామని అనేవారు. గెస్ట్ హౌస్ అనగానే నాకు సీన్ అర్ధమయ్యేది. మళ్లీ నాతో పాటు అమ్మని తీసుకురావొద్దని చెప్పేవారు. దీంతో వాళ్లు ఏం ఆశిస్తున్నారో నాకు అర్ధమయ్యేది. ఇదంతా కూడా కొత్త కంపనీల్లోనే ఎక్కువగా జరిగేది. ఆ కంపనీల నుండే నేను కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -