Friday, March 29, 2024
- Advertisement -

నయనతార కి పెద్ద ఫ్యాన్ ని అంటున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోని స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకటి. మాములుగా అయితే ఒకే రేంజి లో ఉండే హీరోయిన్ల మధ్య బోలెడు తగాదాలు ఉంటాయి అని టాక్ ఉంది. కానీ అలాంటివేమి తమన్నా మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి కారణం ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా నయన్ ని ఆకాశానికి ఎత్తేయడం. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమన్నా తాను నయనతార కి పెద్ద ఫ్యాన్ ని అని చెప్పుకొచ్చింది.

తను నటించిన ‘ఖామోషీ’ తమిళ వెర్షన్ లో నాయనతర నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. “నేను ఆమె(నయనతార) తో ‘సై రా’ సినిమాలో నటించాను. మా మధ్య కొన్ని మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆమెతో నటించడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పింది తమన్నా. అంతే కాకుండా తనకి నయన్ అంటే చాలా ఇష్టమని, ఇండస్ట్రీ లో ఆమె ఇన్ని సంవత్సరాలుగా నిలదొక్కుకు రావడం చాలా గొప్ప అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇక వీరిద్దరూ కలిసి నటించిన ‘సై రా’ సినిమా అక్టోబర్ రెండున విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -