Tuesday, March 19, 2024
- Advertisement -

పవన్ మూవీలో ఛాన్స్.. ఆలీ సమాధానం ఇదే..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఆలీ నటించాడు. కానీ గత ఎన్నికల టైంలో వీరిద్దరి మధ్య విభేదాలు, మనస్పర్దలు వచ్చాయి. అయితే అవన్ని మర్చిపోయి తన స్నేహితుడు ఆలీకి పవన్ ఫోన్ చేసినట్లు సమాచారం. తన సినిమాలో నటించమని ఆలీని పవన్ కోరినట్లు తెలుస్తోంది.

ఈ రూమర్స్ పై తాజాగా ఆలీ స్పందించాడు. రాజకీయాలు, సినిమాలు వేరని.. తన స్నేహితుడి సినిమాలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ ఆలీ చెప్పారు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఇప్పటి వరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా సంప్రదిస్తే గనుక పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సినిమా కెరీర్‌ను రాజకీయాలతో ముడిపెట్టను’’ అని ఆలీ స్పష్టం చేశారు. మరి తన స్నేహితుడికి పవన్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

ఇక గత ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరిన ఆలీ.. జగన్ తరుపున ప్రచారం చేశారు. అయితే ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి పదవులు ఇచ్చిన జగన్.. ఆలీకి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం వైసీపీ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం మార్చిలో జరగనున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల తరవాత ఆలీని ఓ కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -