కమల్ తో నాకు ఎఫైర్ లేదు : పూజా కుమార్

432
I have No Relation with Kamal Star heroine
I have No Relation with Kamal Star heroine

ఏదొక కాంట్రవర్సీతో కమల్ హాసన్ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన సినిమాలు ఏడాదికి ఒక్కటి రిలీజ్ అవుతే ఆయనకు సంబంధించిన వివాదాలు మాత్రం వారానికి ఒక్కటి వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. కమల్ హాసన్ ని రొమాంటిక్ హీరో అంటారు. ఆరు పదుల వయసు నిండినా ఆయన సినిమాలలో ఘాటు సన్నివేశాలు ఉంటాయి. అయితే ఆ సన్నివేశాలే కొన్నిసార్లు తంటాలు తెస్తాయి. ప్రస్తుతం అలాంటి తంటానే హీరోయిన్ పూజాకుమార్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విషయంలోకి వెళ్తే.. గతంలో కమల్ పుట్టినరోజును తన ఫ్యామిలీ సభ్యుల మధ్య చేసుకున్నారు. ఈ వేడుకలో పూజా కుమార్ కూడా కనిపించింది. దీనితో మళ్లీ చర్చ మొదలైంది. పూజా కుమార్ – కమల్ హాసన్ మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని వివాదం చెలరేగింది. ఈ పుకార్లపై పూజా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. “నేను గత ఐదారేళ్లుగా కమల్ సార్ తో కలిసి పని చేస్తున్నాను. ఆయన ఓ గొప్ప క్రియేటర్ అండ్ ఓ మెస్మరైజర్. ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు.

నిజానికి నాకు ఓపికతో ఉండటం ఎలాగో నేర్పించింది ఆయనే. నాకు కమల్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబెర్స్.. బ్రదర్స్.. కూతుర్లు అందరూ బాగా పరిచయం. కానీ ప్రస్తుతం వస్తున్న పుకార్లు చూస్తుంటే.. నేనేదో కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నాకు ఆయన కుటుంబం.. కుటుంబ సభ్యులు బాగా తెలుసు.. అందరితో బాగా మాట్లాడతాను అంతే. ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా.. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Loading...