Friday, March 29, 2024
- Advertisement -

అవతార్‌-2లో ఆంధ్రా అమ్మాయి

- Advertisement -
  • హ‌లీవుడ్ సినిమాకు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం

ప్ర‌పంచంలో అతి పెద్ద సినీ ప‌రిశ్ర‌మ హాలీవుడ్. ఈ స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో క‌ష్టాలు ప‌డాలి. ఒక జీవితం కూడా చాల‌దు అంటే అతిశ‌యోక్తి కాదు. కానీ మ‌న తెలుగింటి అమ్మాయికు అరుదైన అవ‌కాశం హ‌లీవుడ్‌లో ల‌భించింది. ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రంగా రూపొందుతున్న సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా ప‌ని చేసేందుకు అవ‌కాశం వ‌చ్చింది.

ఆశ్రితా కామత్ యువ‌తి జేమ్స్ కేమరాన్ దర్శకత్వంలో రూపొందుతున్న అవతార్-2 చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్త‌మ ఫిలిం ఇనిస్టిట్యూట్ అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్. ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రొడక్షన్ డిజైన్‌లో అశ్రిత ఎంఎఫ్‌ఏ చేసింది. ఆమె చేసిన మొదటి థీసిస్ ఫిలిం ‘ఇంటర్ స్టేట్’కు 2014లో 41వ స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్‌లో రజత పతకం లభించింది. రెండో థీసిస్ ఫిలిం ‘డస్ట్ ల్యాండ్’.. బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైన్ విభాగంలో ఫిలింక్వెస్ట్‌కు నామనిట్ అయ్యింది.

ఆశ్రిత తల్లి గ్రాఫిక్ డిజైనర్కా. తనకు తొలి టీచర్ తన త‌ల్లి అని ఆశ్రిత కామత్ గొప్ప‌గా చెప్పుకుంటుంది. గతంలో జిందగీ న మిలేగీ దుబారా చిత్రానికి ప్రాపర్టీ మాస్టర్‌గా వర్క్ చేసిన తర్వాత.. హాలీవుడ్ లో స్కల్ ఐలాండ్.. ఐసీయూ.. పసిఫిక్ రిమ్:అప్రైజింగ్‌తో పాటు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ మూవీ బీఎఫ్‌జీకి కూడా వర్క్ చేసింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న జేమ్స్ కామరాన్ ముూవీ అవతార్-2కు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. తనకు ఇంతగా గుర్తింపు లభిస్తోందంటే.. అందుకు కారణం తన కుటుంబం అంటోంది ఆశ్రితా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -