Thursday, April 25, 2024
- Advertisement -

ప్రేయసి కోసం వండి పేడుతున్న చైతు

- Advertisement -
Inspiring Pair Of Naga Chaitanya And Samantha

లవర్స్‌ అందరికీ సమంత, చైతన్య లవ్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు. ఈతరం ప్రేమికులు ఎలా వుండాలనేది వీరిద్దరూ చూపిస్తున్నారు. అయిదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల అంగీకారం పొంది, కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి, ఒకరికి ఒకరు సరిజోడి అని నిర్ధారించుకుని, నిశ్చితార్ధం చేసుకుని త్వరలో పెళ్లికి సిద్ధమవుతోన్న ఈ సెలబ్రిటీ జంట తీరిక సమయాల్లో ఎంత జాలీగా గడుపుతారనేది సమంత పోస్ట్‌ చేసే ఫోటోలతోనే తెలుస్తోంది.

ఇద్దరి కెమిస్ట్రీ ఏమిటి, ఇద్దరి మధ్య వున్న ప్రేమ తాలూకు గాఢత ఏంటనేది ఆ ఫోటోల్లో కనిపిస్తూ వుంటుంది. ప్రతి పండగని, పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్‌ చేసుకునే ఈ జంట తరచుగా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కీ పార్టీలిస్తూ వుంటుంది. ఈ జంటని ఎవరు చూసినా లవర్స్‌ అంటే వీళ్లలాగే వుండాలని అంటున్నారు.  షూటింగ్‌ లేకపోతే ఇద్దరూ కలిసే వుంటారు తప్ప వేర్వేరు వ్యాపకాలేమీ పెట్టుకోరు.

సమంత కోసం చైతన్య వంటవాడి అవతారం ఎత్తుతాడు. అతని కోసం ఆమె ఏదైనా చేసేస్తుంటుంది. ఎంత హీరో అయినా ప్రేయసి కోసం వండి పెడితే వుండే ఆనందమేంటనేది చైతన్య చేసి చూపిస్తున్నాడు. ఈతరం ప్రేమికులు అందరికీ వీరిద్దరూ ఆదర్శంగా నిలుస్తూ ప్రేమించుకుంటే వీళ్లలానే ప్రేమించుకోవాలి అన్నట్టుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?
  2. బయటపడ్డ సీక్రెట్.. సమంతకు అసలు మాటలు రావట..
  3. చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..
  4. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చైతూ.. సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -