Wednesday, April 24, 2024
- Advertisement -

‘ఇస్మార్ట్ శంకర్’ రీ రిలీజ్ ఈ సినిమాలపై ఎఫెక్ట్ చూపనుందా?

- Advertisement -

ఈమధ్యనే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మరియు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలు విడుదలయ్యాయి. అంతే కాకుండా తమిళంలో సూర్య నటించిన ‘కాప్పాన్’ సినిమా కూడా ‘బందోబస్త్’ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ మరియు ‘గద్దలకొండ గణేష్’ సినిమాలు బాగానే ఆడుతున్నాయి కానీ సూర్య ‘బందోబస్త్’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో కొందరు థియేటర్ యజమానులు ‘బందోబస్తు’ సినిమాను తీసేసి మళ్ళీ రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ మొట్టమొదటిసారిగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ గా మారింది. నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని పూరి మరియు చార్మి సంయుక్తంగా నిర్మించారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫారం పైకి రానున్నప్పటికీ ఈ సినిమాని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వస్తాయని వారి నమ్మకం. అయితే ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ‘గద్దలకొండ గణేష్’ మరియు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలపై పడుతుందని కొందరు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -