Saturday, April 20, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ కౌషల్ ఆర్మీ హ్యాపీ

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లోకి నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే శ్యామల, తేజశ్వి ఎలిమినేషన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో ఆ విషయాన్ని ప్రకటించకముందే వార్తలు లీకయ్యాయి. మా టీవీలో వీరి ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కాకముందే.. వీళ్లిద్దరూ వారి వారి ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయింది శ్యామల, ఈ వారం ఎలమినేట్ అయింది తేజశ్వి… అని నానీ ప్రకటించకముందే, ఆ ఎపిసోడ్ మా టీవీలో ప్రసారానికి ముందే, ఎలిమినేషన్ న్యూస్ లీకైపోయింది.

ఆ లీకులు నిజమే అని తెలియజేస్తూ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వాళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడని, మిగతా ఐదుగురు ఎలిమినేటర్స్ కంటే అతడికే అత్యధిక ఓట్లు పడ్డాయని లీకులు జోరుగా వస్తున్నాయి. బిగ్ బాస్ 2 స్టూడియోలో ఎడిటింగ్ డిపార్ట్ మెంట్, కెమేరా డిపార్ట్ మెంట్ స్టాఫ్ వారి స్నేహితులకు నూతన్ నాయుడి ఎంట్రీ గురించి చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేపు ఆదివారం అధికారికంగా ఆయన రీ ఎంట్రి ఖాయమని కౌషల్ ఆర్మీ సహా నూతన్ నాయుడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

మరోవైపు వీరి వాదనలకు బలం చేకూర్చేలా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ పూర్తి అయిన తర్వాత, మరో గంటకు నూతన్ నాయుడు, అంటే అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన ఫేస్ బుక్, వాట్సప్ ప్రొఫైల్ పిక్స్ మార్చాడు. చాలా హ్యీపీగా ఉన్న పిక్స్ అప్ లోడ్ చేశాడు. అయితే తనకు బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వస్తే మీకు చెబుతాను అని ఆయన ఇప్పటికే పలు ఇంటర్వూల్లో అభిమానులకు చెప్పాడు. కానీ రీ ఎంట్రీకి సిద్ధంగా ఉండమని ఫోన్ కాల్ వస్తే, అలా ముందే ఇతురలతో ఆ విషయం షేర్ చేసుకోకూడదు అనే రూల్ బిగ్ బాస్ లో ఉంది. దీంతో తన రీ ఎంట్రీ విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా నూతన్ నాయుడు ఇండైరెక్టుగా చెప్పాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆదివారం షోలో నూతన్ నాయుడి రీ ఎంట్రీని నానీ అధికారికంగా ప్రకటించే వరకూ ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాలనేది బిగ్ బాస్ నిర్వాహకుల ప్రయత్నం.

కానీ ఎక్కడో లీకులు మొదలై వైరల్ అయిపోతున్నాయి. ఏది ఏమైనా నూతన్ నాయుడి రీ ఎంట్రీ కోసం కౌషల్ ఆర్మీ, నూతన్ నాయుడి అభిమానులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఓటింగ్ లో నిత్యం పాల్గొంటూ…నూతన్ రీ ఎంట్రీ కోసం చాలా కష్టపడ్డారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి రోజంతా క్యాంపెయినింగ్ నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో నూతన్ రీ ఎంట్రీ ఖరారైపోయింది. ఓటింగ్ లో ఆయనే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాడు అనే వార్తలు జోరుగా వినిపిస్తుండటంతో కౌషల్ ఆర్మీ, నూతన్ నాయుడి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక కౌషల్ తో కలసి నాయుడుగారు బిగ్ బాస్ హౌస్ లో దుమ్మురేపుతారని జోకులు షేర్ చేసుకుంటున్నారు. ఇక వచ్చే వారం బాబు గోగినేని, తనీష్ ను బయటకు పంపేందుకు సిద్ధం కావాలని మెసేజ్ లు వైరల్ అవుతున్నాయిప్పుడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -