చిన్న షార్ట్స్ వేసుకుని పిచ్చేక్కిస్తున్న అనసూయ (వీడియో)

9656
jabardasth anchor anasuya bhardwaj superb dance in home while doing work
jabardasth anchor anasuya bhardwaj superb dance in home while doing work

లాక్ డౌన్ కావడంతో సెలబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉంటూ తమ పనులు తాము చేసుకుంటున్నారు. బుక్స్ చదవడం, బట్టలు సర్దుకోవడం, సినిమాలు చూడటం ఇతర ఇతర పనుల్లో ఉండిపోతున్నారు. ముఖ్యంగా అనసూయ, రోజా, సుమ లాంటి వాళ్లు కూడా తాము సెలబ్రిటీస్ అనే విషయం మరిచిపోయి తల్లి అనే విషయం గుర్తు తెచ్చుకుని హాయిగా ఇంటి పనులతో.. పిల్లలతో గడిపేస్తున్నారు.

ఇంట్లో పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. మరికొందరు అయితే హాయిగా ఇంట్లోనే ఉండి డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ రెండూ చేస్తుంది. ఇంటి పనులు చేస్తూనే డాన్సులు కూడా చేస్తుంది. ఆడుతు పడుతు పని చేస్తే ఆ మజానే వేరు అంటుంది అనసూయ. అంట్లు తోముకుంటూ కూడా అదిరిపోయే డాన్సులు చేసి ఫ్యాన్స్ కి కిక్కు ఇస్తోంది. దానికితోడు చిన్నచిన్న షార్ట్స్ వేసుకుని పిచ్చెక్కిస్తుంది.

అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ డాన్సులు చేస్తూ గిన్నెలు కడుగుతుంటే ఆమె భర్త భరద్వాజ్ ఇల్లు క్లీన్ చేస్తూ సాయం చేస్తున్నాడు. మొత్తానికి ఈ లాక్ డౌన్ పీరియడ్ అంతా ఇంట్లోనే ఉండి హాయిగా అలా కానిచ్చేస్తున్నారు మన స్టార్స్.

Loading...