జబర్దస్త్ నుంచి అనసూయ ఔట్.. ఎందుకు ?

2380
Jabardasth Anchor Anasuya Out From Jabardasth Show
Jabardasth Anchor Anasuya Out From Jabardasth Show

యాంకర్ అనసూయకు ఇంత క్రేజ్ వచ్చిందంటే ముఖ్యకారణం జబర్దస్త్ అనే చెప్పాలి. ప్రస్తుతం కూడా జబర్దస్త్ చేస్తోంది ఈ భామ. ఈ షో చేస్తేనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అలానే ఇతర షోస్ కూడా చేస్తోంది. దాంతో యాంకర్ అనసూయకు విపరితమైన క్రేజ్ వచ్చింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘జబర్దస్త్’ నిర్వాహకుల నియమం ప్రకారం.. ఏక కాలంలో ఎవరూ రెండు షోలలో కనిపించకూడదు. అంటే జబర్దస్త్ లో చేసే వారు మరో యాజమాన్యం నిర్వహిస్తున్న షోలో చేయకుడదు అనేది రూల్. కానీ ప్రస్తుతం అనసూయ ఒక వైపున ‘జబర్దస్త్’ చేస్తూనే, మరో వైపున వేరే చానల్లో ‘లోకల్ గ్యాంగ్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. ‘జబర్దస్త్’లో అనసూయ కొనసాగడానికి ఇప్పుడు ఇదే అభ్యంతరమైందట.

అందుచేత త్వరలోనే జబర్దస్త్ కు మరో యాంకర్ రాబోతుందని.. ఈ షో నుంచి అనసూయను తీసేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి అనసూయ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక అనసూయ జబర్దస్త్ లోనే ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Loading...