Tuesday, April 23, 2024
- Advertisement -

రష్మీ నా జీవితం.. ఆమెను వదలను : సుధీర్ వ్యాఖ్యలు

- Advertisement -

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ కు బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి ఏ షో చేసిన అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. వీరి మధ్య లవ్ ఉందని రకరకల రూమర్స్ వస్తునే ఉన్నాయి. ఏది ఏమైన వీరిద్దరు బిల్లితెరపై చూపించే కెమిస్ట్రీకి ఎవరైన ఫిదా కావాల్సిందే.

అందుకే వీరి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సుధీర్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అలీ అడిగిన పలు ప్రశ్నలకు సుధీర్ సమాధనం చెప్పాడు. స్క్రీన్ పై తన హీరోయిన్ రష్మీ మాత్రమేనని.. ఎవరూ వచ్చిన ఒప్పుకోనని.. తను నా లైఫ్ అని సుధీర్ కామెంట్స్ చేశాడు.

రష్మీ వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని.. ఓ రకంగా తాను స్టార్ డమ్ సంపాదించడానికి రష్మీనే కారణం అని చెప్పాడు. ఒకప్పుడు తాను సెట్ లో మాత్రమే కలిసేవాళ్లమని.. ఇప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటున్నామని చెప్పాడు. రష్మీ తిడుతుందా అని అలీ అడగ్గా.. ఇష్టమొచ్చినట్లు తిడుతుందని చెప్పాడు సుధీర్. మరి తెలుగు రాదు కదా అని అడగ్గా.. వచ్చిన భాషలో తిడుతుందని తెలిపాడు.

ఇక రష్మీ తన లైఫ్ లో ఎన్నో కష్టాలను చూసిందని.. ఆమె కష్టాల గురించి తెలిసాకే ఆమెపై గౌరవం పెరిగిందని.. ఇప్పుడు ఆమె కష్టానికి ఫలితం దక్కిందని తాను అనుకుంటున్నానని సుధీర్ చెప్పాడు. ఇక జబర్దస్త్ వదిలిపెడతావని వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. జబర్దస్త్‌ను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే జబర్దస్త్ నిర్వాహకులైన మల్లెమాల ప్రొడక్షన్స్‌ వాళ్లను అడుగుతానని, వాళ్లు వెళ్లొద్దని అంటే వెళ్లనని సుధీర్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -