Saturday, April 20, 2024
- Advertisement -

జబర్దస్త్ అవినాష్ కొత్త ఇంటి గృహప్రవేశం..!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో.. ప్రముఖ ఛానల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. కొన్ని వందల స్కిట్స్ తో ఎంతో మందిని నవ్వించిన ఈ జబర్దస్త్.. ఎంతోమంది జీవితాలను కూడా నిలబెట్టింది. యాక్టర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని.. కెరియర్లో ముందుకెళ్లాలి అనుకున్న నటుల కలను జబర్దస్త్ నిజం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రీసెంట్ గా జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. టీం మెంబర్ గా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టీం లీడర్ గా కెవ్వుకార్తిక్తో పాటు జనాలకు నవ్వులు పంచుతున్నాడు అవినాష్. రీసెంట్ గా జనవరి 31న తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసుకున్నాడు.

అవినాష్ ఇల్లు చాలా బాగుంది. తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నాడు. తనకు ఇంతమంచి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ లోగోని ఫ్రెమ్ కట్టించి మరి తన కొత్త ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు.ఈ గృహప్రవేశానికి బ్రహ్మానందంగారు రోజా గారు సాయి కుమార్ గారు యాంకర్ రవి శ్రీముఖి లతోపాటు జబర్దస్త్ టీం అంత వచ్చి అవినాష్ కి, అతని ఫ్యామిలీకి బెస్ట్ విశేష్ తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -