Tuesday, April 23, 2024
- Advertisement -

హైపర్ ఆది లవ్ స్టోరీ గురించి తెలుసా ?

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ షో వస్తుందంటే టీవీ ముందు వాలిపోవాల్సిందే. టైం కుదుర్చుకుని మరి ఈ కామెడీ షో చూసేవాళ్లు ఎంతో మంది. ఆ రెంజ్ లో ఈ షో పేరు తెచ్చుకుంది. అయితే ఈ జబర్దస్త్ టీమ్స్ లో హైపర్ ఆదికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆది స్కీట్ కోసం చూసేవాళ్లు కూడా ఉన్నారు. ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే.

ఒక్కోసారి జడ్జిలు నాగబాబు, రోజా కూడా నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బుల్లితెరపై ఇంతలా నవ్వించే హైపర్ ఆది పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తనది లవ్ ఫెయిల్యూర్ అని.. ప్రేమించిన అమ్మాయికి పెళ్లయిందని చెప్పాడు.

కాలేజ్ డేస్ లో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కానీ ఆమెకు పెళ్లి అయిపోయిందని.. పెళ్లి కాకుంటే కచ్చితంగా ప్రపోజ్ చేసేవాడినని చెప్పాడు. ఇక లవ్ లెటర్స్ ఇప్పటివరకు అయితే ఎవరికి రాయలేదని.. ఇకపై లైఫ్ లో ప్రేమా దోమా ఉండవి.. పెద్దలు ఫిక్స్ చేసిన పెళ్లే చేసుకుంటానని ఆది చెప్పాడు.

తన పంచుల సీక్రెట్ రైటింగేనని చెప్పిన ఆది.. ఇండస్ట్రీలో ఆర్పీ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. బంధువులు గతంలో మనుషులకు విలువ ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు వాళ్లున్న పొజిషన్ బట్టి విలువ ఇస్తున్నారని తెలిపాడు. ఫెరంట్స్ తర్వాత తనకు అభి, నాగబాబు, డైరెక్టర్స్ అంటే ఇష్టమని తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -