రష్మీ, అనసూయ యాంకరింగ్‌ నాకు నచ్చదు : ముక్కు అవినాష్

675
Jabardasth Comedian Shocking Comments On Rashmi And Anasuya
Jabardasth Comedian Shocking Comments On Rashmi And Anasuya

బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న షో జబర్దస్త్. జబర్దస్త్ వేదికపై యాంకర్లు రష్మీ, అనసూయ.. అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా ఎవరికి వారు వినోదం పంచుతూ జబర్దస్త్ ను సక్సెస్ చేస్తున్నారు. ఈ జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు. అందులో ముక్కు అవినాష్ కూడా ఒకరు.

అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మీ, అనసూయ యాంకరింగ్ పై కామెంట్స్ చేసి షాక్ ఇచ్చాడు. రష్మీ, అనసూయ యాంకరింగ్‌ తనకు నచ్చదని, వాళ్లిద్దరూ అసలు అందంగా ఉండరని ఓ ప్రోగ్రాంలో ఓపెన్‌గా చెప్పేసి ఆశ్చర్యపర్చాడు. ఆ వెంటనే నాగబాబు, రోజా క్యారెక్టర్స్ గురించి, వారు జబర్దస్త్ కమెడియన్స్‌తో మెదిలే విధానం గురించి స్పందించాడు ముక్కు అవినాష్. మెగా ఫ్యామిలీ వ్యక్తి, పైగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రదర్ అయినప్పటికీ నాగబాబు.. జబర్దస్త్ టీం సభ్యులతో చాలా కలివిడిగా ఉండేవారని చెప్పాడు అవినాష్.

ఆవరసమైతే సలహాలు, సూచనలిస్తూ ఓ స్నేహితుడిలా ఆయన మెదిలేవాడని చెప్పాడు. ఇక రోజా గురించి మాట్లాడుతూ.. ఆమె ఓ ఎమ్మెల్యే, హీరోయిన్, ఎవర్ స్మైలింగ్ బ్యూటీ అని అన్నాడు. ఆవిడ కూడా షూటింగ్ మధ్యలో ఏంట్రా, ఏం చేస్తున్నావ్ అంటూ బాగా కలిసిపోతుందని చెప్పాడు. రోజా, నాగబాబు ఇద్దరిలో ఉన్న ఆ వ్యక్తిత్వమంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు అవినాష్.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!

Loading...