Friday, March 29, 2024
- Advertisement -

ఘనంగా జరిగిన జబర్దస్త్ దుర్గారావు వివాహం..!

- Advertisement -

ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఎంత పాపులర్ లో అందరికీ తెలిసిన విషయమే. ఎనిమిది సంవత్సరాల నుండి జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతోమంది జీవితాలను కూడా జబర్దస్త్ నిలబెట్టిందని చెప్పాలి. జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన వారిలో దుర్గారావు ఒకడు. మేకప్ బాయ్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తన అమాయకత్వాన్ని కామెడీ టైమింగ్ గుర్తించిన తిరుపతి ప్రకాష్ దుర్గారావు తన టీంలోకి చేర్చుకున్నాడు. అలా మేకప్ బాయ్ నుండి ఆర్టిస్ట్ గా మారాడు. మామూలు ఆర్టిస్ట్ నుండి అసలు దుర్గారావు లేకపోతే ప్రకాష్ టీం లేదు అన్నంతగా కూడా ఒక టైంలో మాట్లాడారంటే అతిశయోక్తి కాదు. అలా యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రకాష్ ఇప్పుడు జబర్దస్త్ లేకపోయినా దుర్గారావు కొనసాగుతున్నాడు. ఈ షోనే కాకుండా సినిమాలు కూడా చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాడు దుర్గారావు.

ఇప్పుడు దుర్గారావు ఒక ఇంటివాడు అయ్యాడు. నవంబర్ 29న దుర్గారావు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 31న పెళ్లి చేసుకున్నాడు దుర్గారావు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దుర్గారావు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -