జబర్దస్త్ కి నా వల్ల కూడా హైప్ వచ్చింది : అనసూయ

1790
jabardasth gained popularity because of me anasuya
jabardasth gained popularity because of me anasuya

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ పరిచయం అయ్యారు. వారు మంచి ఫాలోయింగ్ సంపాధించుకోవడమే కాదు.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ షో ద్వారా యాంకర్స్ అనసూయ, రష్మీ కి మంచి క్రేజ్ వచ్చింది.

వీరిద్దరు కూడా బుల్లితెరపై రాణిస్తూనే సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. బుల్లితెరపై జబర్దస్త్ ఓ చరిత్ర సృష్టించిందని చెప్పింది. గతంలో ఆ షో నుంచి తాను వెళ్లాక.. రష్మీ యాంకర్‌గా వచ్చిన తర్వాత కూడా ఆ షో నడిచిందని, ఆ షోకి తాను కూడా హైప్‌ తెచ్చానన్న విషయం లిఖించబడి ఉండే విషయమని వ్యాఖ్యానించింది. జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారని అనసూయ తెలిపింది.

‘ఇప్పుడు బాబు గారు లేరు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. మేము వద్దని వెళ్లిపోవడమే తప్ప మల్లెమాల వారు ఎన్నడూ మమ్మల్ని వద్దని చెప్పలేదు’ అని ఆమె చెప్పింది. జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ లో తాని కనిపించలేదని.. అది కేవలం తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే తాను చేయలేకపోయినట్లు చెప్పింది.

పదేళ్ల పెళ్లి బంధంపై అనసూయ ఏం అన్నాదంటే ?

రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

బిగ్ బాస్ 4లో యాంకర్ అనసూయ… రోజుకి ఎంతంటే ?

లైవ్ లో నెటిజన్ పై ఫైర్ అయిన అనసూయ..!

Loading...