ఫస్ట్ టైం శ్రీమతితో జబర్దస్త్ మహేష్ ఇలా..!

10128
jabardasth mahesh with his pavani enjoying in lockdown
jabardasth mahesh with his pavani enjoying in lockdown

జబర్దస్త్ మహేష్ కు బుల్లితెరపై.. వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. మహేష్ జబర్దస్త్ లో తనదైన శైలీలో పంచ్ లు వేసి తెగ నవ్వించాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన కొందరు దర్శకులు అతనికి సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. అయితే రంగస్థలంలో మంచి పాత్ర పోషించి.. రంగస్థలం మహేష్‌గా పేరు తెచ్చుకున్నాడు.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కనే ఉంటూ అద్భుత నటనను ప్రదర్శించాడు. మహానటి, గుణ 369, ప్రతిరోజూ పండగే వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరభించాడు. అయితే ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బంధువుల అమ్మాయి అయిన పావనిని మే 14వ తేదీన ఉదయం. 6.31 గంటల సుముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేయని మహేష్.. తాజాగా శ్రీమతితో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఆస్వాధిస్తున్న మధుర క్షణాలను ఫోటోల బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అందమైన జంటకు నెటిజన్స్ విషెస్ చేస్తున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ మహేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమ వివాహామా? పెద్దలు కుదిర్చిన వివాహామా? అని అడిగిన ప్రశ్నలకు పెద్దలు కుదిర్చినదేనని సమాధానం ఇచ్చాడు మహేష్.

Loading...