నైట్ టైం వస్తూ ఆ కుర్రాళ్ళు అలా చేశారు : జబర్దస్త్ నటి ప్రియాంక

686
Jabardasth Priyanka Syas About Sexual Harassment On Her
Jabardasth Priyanka Syas About Sexual Harassment On Her

మారుతున్న కాలంలో కొందరు కీచక కుర్రాళ్ళు రోడ్డుపై అమ్మాయిలు కనిపిస్తే వారిని ఇబ్బంది పెట్టడం వంటి చేస్తూ ఉంటారు. ఇలాంటిదే తన లైఫ్ లో కూడా జరిగిందని జబర్దస్త్ నటి ప్రియాంక (సాయి తేజ) చెప్పింది. సాయి తేజ జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు. అయితే ప్రియాంకకు ఈ మధ్య పెళ్లి అయిందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఓ మీడియతో మాట్లాడుతూ పెళ్లి వార్తలపై స్పందిస్తూ తన లైఫ్ లో జరిగిన సంఘటన గురించి చెప్పింది. కొన్ని రోజుల క్రితం కొందరు యువకులు తనతో అసభ్యంగా బీహేవ్ చేశారని.. నడి రోడ్డుపై బైక్ ఆపి చాలా చెత్తగా ప్రవర్తించారని ప్రియాంక చెప్పింది. తాను నైట్ టైం స్కూటీ పై నుంచి వస్తుంటే.. ఆ కుర్రాళ్ళు నన్ను చూసి చెత్త కామెంట్స్ చేశారని.. చుడిదార్ వేసుకుని.. పూర్తిగా మొహం కప్పుకుని కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నా కూడా తనను వాళ్లు కామం కళ్ళతో చూస్తూ కామెంట్స్ చేయడం బాధగా అనిపించిందని.. అలాంటి వారిని ఏం చేసినా పాపం లేదని ఫైర్ అయింది ప్రియాంక.

కుర్రాలు ఇలా చేస్తుంటే భయమేస్తుందని.. అర్ధరాత్రి ఓ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఇలాంటి నీచులు ఉన్నంత వరకు అమ్మాయిలపై దారుణాలు జరుగుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక గతంలో ఓ దర్శకుడు తనకు ఆఫర్ ఇచ్చి రూంకి పిలిచాడని.. సంచలనం రేపిన ప్రియాంక ఇప్పుడు ఈ పోకిరీ వెధవలపై ఫైర్ అయి వార్తల్లో నిలిచింది. ఇక తనను ఇంకా పెళ్లి కాలేదని.. అర్దం చేసుకునే వ్యక్తి వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది ప్రియాంక.

Loading...