Friday, April 19, 2024
- Advertisement -

మెగా-నందమూరి అభిమానులని కలపాలని చూస్తున్న జక్కన్న

- Advertisement -

సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కి సంబందించిన షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కి సంబంధించి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమా లో రామ్ చరణ్ తో పాటు గా ఎన్టీఆర్ కూడా నటిస్తూ ఉండటం తో సాధారణం గా నే సినిమా మీద ఆసక్తి అమాంతం పెరుగుతూ వస్తుంది. ఇక పోతే ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ విషయం లో బాధ పడాల్సి వస్తుందేమో అని రాజమౌళి భావిస్తున్నారట.

మన హీరోల అభిమానులు ఏ కారణం లేకుండా నే బూతులు తిట్టుకుంటూ ఉంటారు సోషల్ మీడియా లో. అలాంటిది ఒక మెగా హీరో, ఒక నందమూరి హీరో ఈ సినిమా లో నటిస్తున్నారు. అభిమానులు అందరూ తమ కి ఇష్టమైన హీరో పైచేయి చూపించాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ విషయం లో కొంచెం అటూ ఇటూ అయినా అభిమానులు గొడవ పడటం,అది నేషనల్ మీడియా ని ఆకర్శించడం జరుగుతుందని రాజమౌళి కి అది నచ్చదని సమాచారం.

ఇలా జరిగితే అనవసరం గా సినిమా మీద నెగటివిటీ వస్తుంది అని, అది కరెక్ట్ కాదని అయన అనుకుంటున్నారట. అందుకే ఎవరి లుక్ మొదటగా విడుదల చేయాలా అనే దాని పైన కూడా ఒక సందిగ్ధత తో ఉన్నారు ఈ దర్శక దిగ్గజం. ఇక చివరికి ఈ హీరోల చేతనే పోస్ట్స్ పెట్టించి అభిమానులని ఐక్యం చేయాలని ఆయన అనుకుంటున్నారట. మరి హీరోలు వారి ఇగో లు పక్కన పెట్టి రాజమౌళి చెప్పింది చేస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -