Thursday, April 25, 2024
- Advertisement -

ప్రెస్ మీట్ పెట్ట‌బోతున్న జీవిత‌?

- Advertisement -

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వివాదం సంచ‌ల‌నంగా మారుతుంది.న‌టి శ్రీరెడ్డి మొద‌లు పెట్టిన ఈ పోరులో త‌రువాత చాలామంది బ‌య‌టికి వ‌చ్చి ఇండ‌స్ట్రీలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాలు గురించి చెప్పుకుంటున్నారు.కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై జరుగుతున్న టీవీ చర్చల్లో భాగంగా రోజుకో కొత్త పేరు బయటికి వస్తోంది.సామాజిక కార్యకర్త సంధ్య.. రాజశేఖర్-జీవిత దంపతుల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. పేద అమ్మాయిల్ని వలలో వేసుకుని జీవితే వాళ్లను తన భర్త దగ్గరికి పంపేదంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి.ఈ ఆరోపణలపై జీవిత ఇంత‌వ‌ర‌కు స్పందించ‌ లేదు. ఈ ఆరోపణలపై జీవిత స్పందన ఏంటన్నది తెలియడం లేదు.

ఐతే ఈ రోజు సాయంత్రం ఈ వ్యవహారంపై తాను ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ ప్రెస్ మీట్లో జీవిత ఏం మాట్లాడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆరోపణలు చేసిన సంధ్యపై లీగల్ యాక్షన్ తీసుకోబోతోందట జీవిత. ఇప్పటికే లాయర్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్నే జీవిత ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశముంది. మ‌రి ఈ ప్రెస్ మీట్‌లో ఆమె భ‌ర్త‌ హీరో రాజ‌శేఖ‌ర్ వ‌స్తారా లేదా అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికి పోతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -