అలా కిస్ చేయడం వల్ల భర్త మీద కోరిక కలిగింది : యాంకర్ ఝాన్సీ

2392
jhansi shocking comments on manmadhudu 2 liplock scene
jhansi shocking comments on manmadhudu 2 liplock scene

నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. యాంకర్ గా మంచి క్రేజ్ సంపాధించుకుంది ఝాన్సీ. ఈ క్రమంలో యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటించింది. 1994లో వచ్చిన ‘ఎగిరే పావురమా’ సినిమాతో ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సపోర్టింగ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న మహిళగా చాలా పాత్రలే చేసింది.

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఝాన్సీ… ప్రముఖ నటుడు జోగీ నాయుడును ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లకు ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో ఝాన్సీ ఒంటరిగా ఉంటుంది. అయితే జోగీ నాయుడు మాత్రం మరో వివాహం చేసుకున్నారు. తాజాగా ఝాన్సీ.. సింగర్ సునీతతో కలిసి ‘అలీతో సరదాగా’ అనే షోలో పాల్గొంది. ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో వీరిద్దరూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో ప్రతి విషయానికీ స్పందించాల్సి అవసరం లేదని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ‘మన్మథుడు 2’లో తన లిప్‌లాక్ సీన్‌పై ఝాన్సీ తొలిసారి కామెంట్స్ చేశారు. ఆ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ.. ” సినిమాలో అది అవసరం కాబట్టే రాహుల్ ఆ సీన్ చేయించాడు. హీరోయిన్ కిస్ చేయడం వల్లే… భర్త మీద కోరిక కలిగి నా పాత్ర అతడితో వెళ్లిపోతుంది. ఎంత బోల్డుగా తీశాడో కదా. ఆడవాళ్ల కోరికల గురించి రాహుల్ ఎంతో ధైర్యంగా చూపించాడు. దాన్ని అందరూ మెచ్చుకోవాలి. అంతేకానీ తప్పుగా చూడకూడదు’ అని ఆమె చెప్పుకొచ్చింది.

టెంపర్ మూవీని ఆర్.నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడంటే ?

ఛాన్స్ ఇస్తానని పిలిచి.. రూంలోకి తీసుకెళ్లాడు : ఫన్ బకెట్ భార్గవి

టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి మూవీ ఏదో చూడండి ?

వరల్డ్ రికార్డ్ సృష్టించిన మహేష్ బర్త్ డే ట్రెండ్

Loading...