కుక్కలకు జవాబు చెప్పము : సునీత, ఝాన్సీ ఫైర్

1442
Jhansi Sunitha in Alitho Saradaga
Jhansi Sunitha in Alitho Saradaga

సింగర్ సునీతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమె పాటలు వింటూ హాయిగా ఊహా లోకలకు వెళ్లిపోవచ్చు. అంత అద్భుతంగా పాడుతుంది. అలానే యాంకర్ ఝాన్సీ.. కూడా యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది. అయితే వీరిద్దరు కొన్ని కారణాల వల్ల వీరి భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే వీరిపై అప్పట్లో ఎన్నో గాసిప్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.

ఇటీవల సింగర్ సునీత,యాంకర్ ఝాన్సీ కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో వీరిద్దరికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీ జీవితంలో ఎదురైన చెడు అనుభవాలను ఎలా అధిగమించారు?’ అంటూ సునీత, ఝాన్సీలను ప్రశ్నించాడు. దానికి సునీత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సునీత మాట్లాడుతూ.. “నేను, ఝాన్సీ.. ఇద్దరం బలమైన మహిళలమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కష్టకాలంలో కూడా మేము తట్టుకుని .. నిలబడిన తీరే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడిచ్చిన ట్యాలెంట్…మాకు అవకాశాలను తెచ్చిపెట్టింది.

అవి ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ క్రమంలో ఎన్ని కుక్కలు మొరిగినా మేము పట్టించుకోము. అసలు అలాంటి వాళ్లను కుక్కలతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నిజం ఏంటన్నది ఎవ్వరూ తెలుసుకోరు. ‘ఇలా జరిగింది అట’ అని ఏంటేంటో చెప్పేసుకుంటారు. ‘అట’ అన్నదానికి అంత పవర్‌ ఉంటుందని నాకు తెలియదు. నేను, ఝాన్సీ.. ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. అప్పటి నుండీ మా జీవితాల్లో జరిగిన ఎన్నో విషయాల్లో సిమిలారిటీస్ ఉన్నాయి. మా పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిని సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా తలదించుకునే పని చేయలేదు.

అందుకే ఇంకొకరికి జవాబు ఇవ్వాల్సిన అవ్సరం లేదు. మాపై ఏమైనా ఆరోపణలు వచ్చినా.. ఎవరితోనైనా లింకప్ చేసినట్లు.. మాట్లాడిన దానిపై మేము స్పందించకపోవడానికి కారణం… అసలు నిజమేంటో మాకు తెలుసు.. వారికి తెలీదు అనే చిన్న లాజిక్. మా ఫ్యామిలీస్ కి మేము ఏంటో తెలుసు. మేము జవాబు ఇవ్వాల్సింది మా ఫ్యామిలీకి మాత్రమే. మా వాళ్లకు మా గురించి అన్ని తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

వందల కోట్లు వద్దని.. మాములు అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశీ..!

అందంగా ఉంటే వదలరు వీళ్ళు.. ప్రగతి ఆంటీ సంచలన వ్యాఖ్యలు

Loading...