Friday, April 19, 2024
- Advertisement -

జోడి సినిమా రివ్యూ

- Advertisement -

సినిమా: జోడి
విడుదల తేదీ : సెప్టెంబరు 06, 2019
నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్, వెన్నెల కిషోర్, గొల్లపూడి మారుతీ రావు, సత్య.
దర్శకత్వం : విశ్వనాధ్ అరిగెల
నిర్మాత‌లు : సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
సంగీతం : ఫణి కళ్యాణ్
సినిమాటోగ్రఫర్ : విశ్వేశ్వర్ ఎస్వీ

కథ:
కపిల్ (ఆది) కాంచనమాల (శ్రద్ధ) ని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత కాంచనమాల తో ప్రేమలో పడి ఆమె వెనకాల పడి మొత్తానికి ఆమెని ఒప్పించే టైం కి కాంచన మాల వాళ్ళ నాన్న ఈ రిలేషన్షిప్ కి అడ్డు చెప్తాడు. అసలు వాళ్ళ నాన్న అలా ఎందుకు చేసాడు? ఆ తర్వాత వాళ్ళ ఇద్దరూ ఏం చేశారు? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ.

నటీనటులు:
ఆది సాయి కుమార్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. ప్రతి సినిమా లోనూ ఏదో ఒక కొత్తగా చూపించడానికి ప్రయత్నించే ఆది ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో తన పాత్రకి ప్రాణం పోసాడు అని చెప్పుకోవచ్చు. ‘జెర్సీ’ సినిమాతోనే అలరించిన శ్రద్ధా శ్రీనాథ్ ‘జోడి’ సినిమా లో కూడా చాలా బాగా నటించింది. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. నరేష్ నటన సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. వెన్నెల కిషోర్ నటనకి ఈ సినిమాలో కూడా మంచి మార్కులు పడతాయి. తెరపై వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. శిజు కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. తన సహజమైన నటనతో పాత్రలో ఒదిగిపోయాడు. సత్య కామెడీ సినిమాకి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ హీరో పక్కనే ఉంటూ సత్య ప్రేక్షకులను చాలా బాగా నవ్విస్తాడు. చాలా కాలం తర్వాత గొల్లపూడి మాధవ రావు మళ్లీ వెండితెరపై కనిపించారు ఎప్పటిలాగానే తన నటనతో మెప్పిస్తారు. సితార స్క్రీన్ ప్రెజెంన్స్ కూడా చాలా బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు విశ్వనాథ్ ఈ సినిమా కోసం ఒక సాదా సీదా కథని ఎంపిక చేసుకున్నారు. ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా సాఫి గా సాగిపోతుంది. అయితే ఎంటర్టైన్మెంట్ మరియు రొమాన్స్ ఈ సినిమాలో ఎక్కువగా హైలైట్ అయ్యాయి. కేవలం ఆ రెండు ఎలిమెంట్లతోనే దర్శకుడు కథని చాలా బాగా నడిపించారు. ఎక్కువగా బోర్ కొట్టించుకుండా దర్శకుడు విశ్వనాథ్ తన స్క్రీన్ప్లేతో అందరినీ ఆకట్టుకుంటారు. నెరేషన్ కూడా ఫాస్ట్ గానే ఉండటంతో ప్రేక్షకులు కథ కి బాగా కనెక్ట్ అవుతారు. భావన క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకటేష్ గుర్రం మరియు పద్మజ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫణి కళ్యాణ్ సంగీతం సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని ఫణి కళ్యాణ్ మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది. ముఖ్యంగా అతని పాటలు చాలా బాగున్నాయి. నేపధ్య సంగీతం విషయంలో కూడా ఫణి కళ్యాణ్ పనితనాన్ని మెచ్చుకోక తప్పదు. ఎస్ వి విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాకి చాలా మంచి విజువల్స్ ని అందించారు.

తీర్పు:
పెద్దగా మలుపులు అంటూ ఏమీ లేకుండా సినిమా సాఫీగాసాగిపోతుంది. మొదటి హాఫ్ మొత్తం సినిమా కామెడీ మరియు రొమాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆది మరియు శ్రద్ధాశ్రీనాథ్ ల మధ్య ప్రేమ కథని చాలా బాగా చూపించారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. వారి కెమిస్ట్రీ కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇంటర్వెల్ లో జరిగే ఒక ఎపిసోడ్ కథని మలుపు తిప్పుతుంది. ఇక రెండవ హాఫ్ మొత్తం కొంచెం ఎమోషనల్గా సాగినప్పటికీ ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ కూడా బాగున్నాయి. నటీనటులు, నేపథ్య సంగీతం మరియు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే రొటీన్ కథ ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయింది. ఇక చివరగా ‘జోడి’ ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -