Wednesday, April 24, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత’ ఫైట్ సీన్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం..!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌-మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా అర‌వింద స‌మేత‌. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బాధ త‌ప్ప‌డం లేదు. సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి. త‌రువాత సినిమాలో ఎన్టీఆర్‌,మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫోటోలు కూడా లీక్ కావ‌డంతో చిత్ర యూనిట్ షాక్ గురైంది. దీంతో షూటింగ్ టైంలో ఫోన్స్‌ని బ్యాన్ చేసింది చిత్ర యూనిట్‌. ఎంత జాగ్ర‌త్త వ‌హించిన సినిమాలోని కీల‌క ఫైట్ సీన్ ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయిన‌ట్లు తెలుస్తుంది.ఎవరో ఔత్సాహికులు మానిటర్ లో ఉన్న ఫైట్ సీన్ ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు.

అది కాస్త బయటకి లీక్ చేశారు. ఎలాంటి ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే ఈ ఫైట్ సీన్ ఆకట్టుకుంటోంది. ఫైట్ చివర్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్ లో చాలా కసిగా, కోపంగా కనిపిస్తున్నాడు. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -