Saturday, April 20, 2024
- Advertisement -

జూ ఎన్టీఆర్ ఇల్లు ఎలా శుభ్రం చేశాడో చూడండి (వీడియో)

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇల్లు శుభ్రం చేసి ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విసిరిన ’బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి ఇంటిని శుభ్రం చేసి తారక్, రామ్ చరణ్ లకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.

దాంతో ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ.. ఇంటి ముందు చెత్తను ఊడ్చేశాడు. ఇదిగో సవాలు స్వీకరించాను జక్కన్న రాజమౌళి అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. వర్క్‌ లోడ్‌ను షేర్‌ చేసుకోవడం ఫన్‌గా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.

‘బాలా బాబాయి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేశ్ గారు, కొరటాల శివగారుకి ఈ సవాలు విసురుతున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు ఆపేసి ఇంట్లోనే ఉంటున్న సినీ సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఇంట్లో వారికి సాయం చేస్తూ ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -