Saturday, April 20, 2024
- Advertisement -

ఆమె ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ ..జూనియ‌ర్ ఎన్టీఆర్‌

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

ఆమె మరణ వార్తతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె దర్శకురాలిగా కూడా ముద్రవేసింది. ఆమె మరణం టాలీవుడ్ కి తీరని లోటని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంగా చేయగా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

ఆమె ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అని… ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పాడు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. ఆమె మరణవార్త తనను కలచివేసిందని.. వారి కుటుంబానికి సానూభూతిని తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -