Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఎన్టీఆర్ సినిమా అదే

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ గా గడుపుతున్నాడు. కొమరం భీం పాత్ర ని పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా లో స్వాతంత్ర సమరయోధుని పాత్ర ని పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా కి సంబంధించి కొన్ని పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. వారు అందించిన సమాచారం మేరకు బ్రిటిష్ సైనికుల తో పోరాడే దృశ్యాల్లో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నాడట. అయితే ఈ సినిమా పైన పూర్తి ఫోకస్ పెట్టాలి అనే అంశం తో ఎన్టీఆర్ ఈ సారి బిగ్ బాస్ షో కి హోస్ట్ ఆఫర్ ని కూడా తిరస్కరించాడు అని తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ ఈ సినిమా విడుదల కి ముందే మరో సినిమా లో కనిపించనున్నాడు. అయితే ఇండస్ట్రీ లో వస్తున్న రూమర్స్ ప్రకారం కొత్త దర్శకుడు నరేంద్ర కీర్తి సురేష్ తో చేస్తున్న ఒక సినిమా లో ఎన్టీఆర్ అతిధి పాత్ర లో కనిపించి కనువిందు చేయనున్నాడట. ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు నిర్మాణం లో రానున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన వంతు సాయం చేయనున్నాడు అనే టాక్ నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -