Thursday, April 25, 2024
- Advertisement -

నందమూరి ఫ్యాన్స్‌కి బంపర్ న్యూస్…… త్రివిక్రమ్ సినిమాలో అదిరిపోయే స్పెషల్స్

- Advertisement -

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో త్రివిక్రమ్ క్రియేటివిటీపైన డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ మాత్రం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. అరవింద సమేత….. వీర రాఘవ అంటే అందరూ కూడా అరవింద అనే హీరోయిన్ పాత్ర కోసం వీర రాఘవుడు ఏం చేశాడు అన్నది కథ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విశ్లేషణ కాస్త నమ్మశక్యంగానే ఉంది. అయితే త్రివిక్రమ్ మరీ ఇంత సింపుల్ లైన్‌తో అజ్ఙాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత సినిమా తీయడన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని త్రివిక్రమ్ సన్నిహితులు చెప్తున్నారు. అరవింద్ అనే ఒక క్లాస్ క్యారెక్టర్ ఉంటుందని…….. అలాగే వీర రాఘవుడిగా మాస్ జనాలకు పిచ్చెక్కించేస్థాయి ఊరమాస్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని చెప్తున్నారు. అరవింద్ అనే క్లాస్ క్యారెక్టర్‌‌కి త్రివిక్రమ్ మార్క్ క్లాస్ లవ్ స్టోరీ ఉంటుందని………. వీర రాఘవుడి పాత్రలో మాత్రం యాంగ్రీ యంగ్‌మేన్ రోల్‌లో అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండ, నా పేరు సూర్యలో అల్లు అర్జున్‌లో ఎన్టీఆర్ కూడా వీరావేశం ప్రదర్శిస్తూ అదరగొడతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ అన్న వార్త నిజమే అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కి పండగే అనడంలో సందేహం లేదు. అలాగే రెండు క్యారెక్టర్స్ ఉండని……… ఒకే క్యారెక్టర్‌కి రెండు షేడ్స్ ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. సింహాద్రి సినిమా స్టైల్‌లోనే ఫస్ట్ హాఫ్ అంతా లవర్ బాయ్‌గా, కూల్ సిటీగయ్‌గా కనిపించేలా ఎన్టీఆర్ ఉంటాడని……..ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వీర రాఘవుడిగా ఎన్టీఆర్ ఆవేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారని……… ఆ తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మిగతా సినిమా ఉంటుందన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ అవ్వడం మాత్రం ఎన్టీఆర్ కంటే త్రివిక్రమ్‌కే చాలా అవసరం. త్రివిక్రమ్ మేజిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -