Saturday, April 20, 2024
- Advertisement -

బాలకృష్ణ బదులు ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించారట

- Advertisement -

2003 లో విడుదలైన ‘సింహాద్రి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి ఇద్దరికీ ఇండస్ట్రీలో పెద్ద బ్రేక్ లభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. నిజానికి ‘సింహాద్రి’ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ మొదటగా ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ని సంప్రదించారట. అయితే అప్పటికి పగ ప్రతీకారం కాన్సెప్ట్ పైనా వరుసగా మూడు సినిమాలు చేసిన బాలయ్య ఈ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట.

అలా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిందట. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఒకప్పుడు రికార్డుల మోత మ్రోగించింది. మరి ఈ సినిమా లో బాలకృష్ణ నటించిన ఉంటే ఎలా ఉండేదో అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -