హాట్ ఫోటో షూట్లతో సందడి చేస్తున్న కాజల్ అగర్వాల్

197
Kajal Agarwal is bustling with hot photo shoots Latest
Kajal Agarwal is bustling with hot photo shoots Latest

టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొంత కాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతోంది. ఈమె నటించిన ‘కవచం’, ఇక ఈ మధ్యనే విడుదలైన ‘సీత’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో కాజల్ మార్కెట్ పడిపోయిందని కొందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో హర్ట్ అయినా కాజల్ తన హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన లేటెస్ట్ ఫోటో షూట్ నుంచి ఒక హాట్ ఫోటో ను షేర్ చేసింది.

తెల్లని డ్రెస్ లో స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ కనిపించిన కాజల్ తన అందంతో యువతను ఉర్రూతలూగిస్తోంది. వెండితెరపై సంగతి పక్కన పెడితే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. ఇక సినిమాల పరంగా కాజల్ అగర్వాల్ తెలుగులో శర్వానంద్ సరసన ‘రణరంగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో హిందీ ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ మరియు ‘కోమలి’ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మంచు విష్ణు నిర్మించబోయే సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Loading...