Tuesday, April 23, 2024
- Advertisement -

ర‌వితేజ‌కు కుదిబండ‌గా మారిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ … ఒక‌ప్పుడు మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వరుస హిట్ల‌తో స్టార్ హీరోల స‌ర‌స‌న చేరాడు. లేటుగా క్రేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికి దానిని చాలాకాలం పాటు కాపాడుకున్నాడు. అయితే ఇది అంతా గ‌తం. ప్ర‌స్తుతం ర‌వితేజ కెరీర్ డౌన్‌లో న‌డుస్తుంది. ర‌వితేజ‌కు ఈ మ‌ధ్య స‌రైన హిట్ లేదు. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన‌ప్ప‌టికి దానిని కొన‌సాగించ‌లేక‌పోయాడు. ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా సినిమాలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్ పుత్ న‌టిస్తోంది. ఈ సినిమా త‌రువాత త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తేరి తెలుగు సినిమాలో న‌టించ‌నున్నాడు ర‌వితేజ‌. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్‌ను ఎంపిక చేశార‌ట చిత్ర ద‌ర్శ‌కుడు. కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకోవ‌డంపై ర‌వితేజ అభిమానులు అసహ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. దీనికి కార‌ణం లేక‌పోలేదు.. కాజ‌ల్‌తో ర‌వితేజ రెండు సినిమాల్లో న‌టించాడు. సారొచ్చారు, వీర ఈ రెండు సినిమాల్లో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి.

మ‌ళ్లీ కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకోవ‌డంతో ర‌వితేజ అభిమానులు అందోళ‌న చెందుతున్నార‌ట‌. ఇప్ప‌టికే మా హీరోకి రెండు ఫ్లాప్‌లు ఇచ్చిన హీరోయిన్‌ని మ‌ళ్లీ ఎలా తీసుకుంటార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి ర‌వితేజ మెడ‌కు కాజ‌ల్ కుదిబండ‌లా మారింద‌ని ఆయ‌న అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -