Friday, March 29, 2024
- Advertisement -

బ్రేక్ అప్ స్టోరీలు చెప్పిన కాజల్, కీయార

- Advertisement -

దాదాపు అందరు స్టార్ హీరో హీరోయిన్ లు తమ ప్రేమ విషయం గురించి అసలు ఏమాత్రం బయటపెట్టరు. ఒకవేళ నిజంగా వారు ప్రేమలో ఉన్నప్పటికీ లేదు మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ బోలెడు కబుర్లు చెబుతారు. కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన ప్రేమ వ్యవహారం గురించి నోరు విప్పింది. తాను మొట్టమొదటిసారిగా పదవతరగతి లో ప్రేమలో పడిందని కానీ తను కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచి రావడం వలన వాళ్ళ పేరెంట్స్ దానిని చాలా సీరియస్ గా తీసుకున్నారని వాళ్ళ అమ్మగారు అతడితో బ్రేకప్ చేయించి చదువుపై కాన్సన్ట్రేట్ చేసేలా చేశారని చెప్పుకొచ్చింది కీయార.

మరోవైపు కాజల్ అగర్వాల్ కూడా తన ఫస్ట్ క్రష్ గురించి నోరు విప్పింది. తన కెరియర్ మొదట్లో తాను ఒకతనితో చాలాకాలం డేట్ చేశానని చెప్పి అందరికీ షాకిచ్చింది. అయితే తరువాత ఆమె తనకి బ్రేకప్ చెప్పానని చెప్పింది. బ్రేక్ అప్ కి చాలా కారణాలు ఉన్నప్పటికీ అందులో మొదటిది ఆ అబ్బాయికి సినిమా ఇండస్ట్రీ పై మంచి ఇంప్రెషన్ లేకపోవడం అని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత తన బిజీ షెడ్యూల్స్ వలన తనకు డేట్ చేసే అవకాశం రాలేదని చెప్పింది కాజల్. ఎంత స్టార్ హీరోయిన్లు అయినప్పటికీ వారికి కూడా హార్ట్ బ్రేక్ లు ఉన్నాయన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -