Thursday, April 25, 2024
- Advertisement -

‘సైరా’ లో కాజల్ కి అవకాశం లేదట

- Advertisement -

ఈ మధ్యనే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి గత కొంత కాలంగా పుకార్లు నిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి తమన్నా, అనుష్క, నయనతార వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ అందులోని నిజానిజాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది.

కథ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కమాండింగ్ మరియు డామినేటింగ్ అప్పీరెన్స్ ఉన్న హీరోయిన్ అవసరం ఉందట. కానీ నిన్న మొన్నటి వరకు గ్లామరస్ పాత్రలు చేసిన కాజల్ అగర్వాల్ ఈ పాత్రకు సరిపోదని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. అందుకే హీరోయిన్ కోసం కాజల్ కంటే అనుష్క, తమన్నా వంటి హీరోయిన్లు అయితే బెటర్ అని చిత్రబృందం అనుకుంటోంది. కానీ అనుష్క మరియు తమన్నా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మళ్ళీ ఈ సినిమాలో కూడా వాళ్లనే హీరోయిన్లుగా తీసుకుంటే బాగుంటుందో లేదోనని కొరటాల శివ ఆలోచిస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -