Saturday, April 20, 2024
- Advertisement -

పారితోషికం కోసం భయాన్ని పక్కన పెట్టిన కాజల్

- Advertisement -

ఇటీవలే రాజు గారి గది 3 అనే సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. సినిమా లో హీరోయిన్ గా ముందు తమన్నా ని అనుకున్నారు కానీ రెండు రోజులు గడిచే లోపే తమన్నా ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకో బయటకు వచ్చినది అనే విషయం ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా లో తమన్నా స్థానం లో ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ రాలేదు. కాకపోతే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ నటించనుందట.

కాజల్ అగర్వాల్ సాధారణం గా హారర్ సినిమాలకి దూరం అని ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉందట. అయితే కాజల్ అగర్వాల్ కి సాధారణం కంటే కొంచెం ఎక్కువ పారితోషికం ఇస్తూ ఉండటం తో ఈ సినిమా ని చేయడానికి ఒప్పుకుందట. పైగా ఈ సినిమా సైన్ చేస్తే కాజల్ కి తప్పకుండా మంచి పేరు వస్తుంది. సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఎలాగైనా కాజల్ తన గ్లామర్ తో, నటన తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేయాలి అని చూస్తుంది. ఈ సినిమా కి దర్శకుడు ఓంకార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -