Tuesday, April 23, 2024
- Advertisement -

ప్రెగ్నెన్సీపై అసలు నిజం చెప్పిన కాజల్..

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై గత కొద్ది రోజులుగా పుకర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అంటూ కొందరు.. మరికొందరు కాజల్ చెల్లి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు పెట్టేశారు.

దాంతో ఈ విషయం గురించి తెలియని కాజల్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంది. తాజాగా.. కాజల్ ఈ వార్తలపై స్పందించి.. అసలు విషయం బయటకు చెప్పింది. అవును.. ఫ్రెగ్నెంట్ కన్ఫాం అంటూ ఆమె ఓ ఫోటో కూడా తన సోషల్ అకౌంట్ లో పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాజల్ ప్రెగ్నెంట్ అన్నది ఆమె చెల్లి నిషా అగర్వాల్ గురించి. టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.

2013లో బిజినెస్ ‌మ్యాన్ కరణ్‌ను పెళ్లి చేసుకున్న నిషా ఇప్పుడు గర్భం దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ తన సోషల్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. ఇక ఈ వార్తతో కాజల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వరుస ఆఫర్స్‌తో కాజల్ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. తన చెల్లికి బిడ్డ పుడుతుందనే ఆనందాన్ని కాజల్ తెగ ఎంజాయ్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -