Friday, April 26, 2024
- Advertisement -

రవి తేజ తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్న కాజల్

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన రెండవ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ అనే కథ ని తన రెండో సినిమాగా తీద్దామని నిర్ణయించుకున్న అజయ్ భూపతి ఈ సినిమా కోసం హీరోలని ఒప్పించడానికి నానా తంటాలు పడుతున్నాడు. అక్కినేని హీరో వద్దన్న తర్వాత ఈ కథ తో అజయ్ భూపతి రవితేజని సంప్రదించగా మాస్ మహారాజా ఓకే చెప్పాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు కానీ తాజాగా రవితేజ మహా సముద్రం సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అయితే ‘సీత’, ‘రణ రంగం’ వంటి డిజాస్టర్ లతో సతమతమవుతున్న కాజల్ అగర్వాల్ తన ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకుంది. కానీ రవితేజ ఈ సినిమా క్యాన్సిల్ చేయడంతో ఈమె పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ‘భారతీయుడు 2’. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే రవితేజ తదుపరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న రవితేజ శృతి హాసన్ తో రొమాన్స్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు కాజల్ ఏ తెలుగు సినిమాకి ఓకే చెబుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -